Geetha Cafe

చీకటి వెలుగుల తెలుగు

Posted by: kvmkishore on: July 18, 2008

Download the pdf version for easy reading cheekati_velugula_telugu

సౌమ్య గారి ఎందుకు చదవాలి అన్న Post చాలా కలకలం సృష్టించింది… మాలతి గారి తెలుగు ఎందుకు మాట్లాడాలి మరింత బాగుంది. ఇప్పుడు ఇవన్ని చదివాక అందరి వ్యాఖ్యలను పరిశీలించిన మీదట ఇన్నాళ్లు చదివి ఊరుకునే నాకు కూడా ఏదో ఒకటి మీ అందరితో పంచుకోవాలి అనిపించింది…

బళ్ళో చదువుకునే రోజుల్లో వేసవి సెలవల్లో ఎప్పుడైనా తెలుగు పుస్తకమో చదివితే వెంటనే… ఓరే తెలుగు పుస్తకాలు కూడు పెడతాయా… నన్ను చూస్తున్నావు కదా తెలుగు లో PhD దాకా చదివినా Government స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నాను అదే లెక్కలో సైన్సో చదువుకొని ఉంటే కనీసం జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఐనా అయ్యెవాడిని. పో వెళ్ళి ఇంగ్లీషో మాత్సో చదువుకో పో అనే వాడు నాన్న.. అప్పటినుంచి జరుగుతున్న నిత్య సంఘర్షనే తెలుగు ప్రామాణికమా కదా అన్నది…

సరే! మాలతి గారు సౌమ్య గారు వ్రాసిన దాన్ని బట్టి మరి కొందరు మిత్రులు వ్రాసిన వ్యాఖ్యలని బట్టి నాకు ప్రధానంగా కనిపించిన అంశాలు ఇవి:

1. వ్యవహారికంగా తెలుగు కు ఉన్న ప్రాముఖ్యత ఏమాత్రం ?
2. తెలుగులో వైవిద్యం ఏమాత్రం ?
3. తెలుగు పై ఆవరణ ప్రభావం ?
4. Career ప్రాధాన్యంగా సాగే జీవితం లో తెలుగు కు ప్రాముఖ్యత అవసరమా ?
5. తెలుగు వెలగడానికి ఎం చెయ్యాలి ?

సరే వీటినె కేంద్ర వస్తువులుగా తీసుకొని నా ఆలోచనలు మీతో పంచుకుంటాను….

ఒకప్పుడు సాహిత్యం గురించి, రాజకీయాల గురించి, ఇతర దేశాల రాజకీయ, వాణిజ్యాల గురించి మాట్లాడే వారిని ఒక సగటు మనిషి కంటే ఎంతో పరిణితి, మానసిక పరిపక్వత ని సాధించిన వ్యక్తిగా పరిగణించే వారు… ఇప్పట్లో అలాగే పరిగణింపబడాలి అంటే సులువైన సూత్రాలు కొన్ని ఉన్నాయి..

1. ప్రతి చిన్న అవసరానికి ఒక Gadget ని చెప్పండి
2. దేవుడు లేడని అంతా సైన్స్ అని వీలైనన్ని న్యాషనల్ జియొగ్రఫీ ఉదాహరణలని కోట్ చేస్తూ మాట్లాడండి
3. మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ వేస్ట్ అని అందులోనూ అరేంజ్డ్ మ్యారేజస్ ట్రాష్ అని అసలు పెళ్లి అనే తంతు తో నిమిత్తం లేకుండా కలిసున్డడమ్ లాజికల్ అని వాదించండి

And last but not the least and most important

4. తెలుగు భాష, సాహిత్యం పద్యం, గద్యం కల్తీ చేసిన మద్యం తో సమానమని విశదీకరిన్చన్ది

నిజం! నిజ్జంగా నిజం. ఫ్లైట్ లో వెల్లేప్పుడు చాలా సార్లు తెలుగు పుస్తకం తీసి చదివితే చాలా మంది పెదవి విరిచి ఏంటి ఇంకా తెలుగు పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారా అంటారు… కొందరు Good తెలుగు చదవాలండి. అని ప్రోత్సహిస్తున్నట్టే ఒక మానసిక వికలాంగూడికి చేయోతను ఇస్తున్నట్టు feel అవుతారు… అంతే కానీ రచయత ఎవరు. కథావస్తువు ఏంటి ఇంకా తెలుగులో మంచి పుస్తకాలు ఏమున్నాయి అని అడగరు..

మరికొందరు ఎవిటీ! అసలు తెలుగు, తెలుగు అని మాట్లాడేవారు చాందసవాదులండి. ఏది నువ్వు ఆపకుండా ఒక్క నిముషం తెలుగు లో మాట్లాడు చూద్దాం. ఒక వేల మాట్లాడినా రేల్‌వే స్టేషన్ కి వెళ్ళాలి అనుకో ఆటో వాడి దగ్గరికి వెళ్ళి ధూమశకట గమనాగమన కేంద్రానికి వెళ్లు అని చెప్తావా అని వెటకారంగా విజయదరహాసాలు చిండిస్తారు. మొన్నటికీ మొన్న తెలుగుకు ఎందుకు ప్రాచీన భాష హోదాను కల్పించాలి… అసలు వాడుకలోనే లేదు, మాట్లాడారు వ్రాయరు అలాంటప్పుడు ఎందుకు.. మేము, భారతిని వైరముత్తు ని తలవకుండా పూట గడవదు అదే ఎంతమందికి కొన్నైనా మంచి రచనలు తెలుసు అంటూ తమిళ స్నేహితులు ఎద్దేవా చేశారు.. తెలుగుకు వేయి సంవత్సరాల చరిత్ర లేదు మరో వేయి సంవత్సరాల భవిష్యత్తు లేదు అంటూ జోశ్యం చెప్పారు… అనవసరంగా ఆవేశపడడమే తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయత నన్ను ఆవహించింది.. చివుక్కుమని అనిపించినా నిజమే అనిపించింది…. అవును మరి ఎమిచేద్దాం! త్యాగరాజ కీర్తనలు అంటే వెగటు, రామదాసు అన్నమయ్య కీర్తనలు అసహ్యం, ఇంకా కందా, సీస పద్యాలాంటె డోకు.. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ శ్రీ, కృష్ణ శాస్త్రి కంటె చేతన్ భగత్ ఆత్మీయుదు.. వెధవాది ముందు చెప్పిన వాలు అందరు పోయారు కానీ ఉంటె కానేసాం చేతన్ భగత్ ని చూసి నేర్చుకునే అవకాశం ఐనా ఉండేది. నేను చెప్పే మాటలతో మీరు ఏకీభవించకపోవచ్చు కానీ నాకు ఎదురైన అనుభవాలు మాత్రం ఐవీ. శ్రీశ్రీ అనేది కృష్ణశాస్త్రి ఇంటి పేరని, విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రదేశ్ ఒకప్పటి Governer అని నేను పలు సంధర్భాల్లో పలువురి వాదనల్ని ఎదుర్కొన్నాను…. పైన చెప్పిన వాటికి అన్నింటికీ ఒకటే కారణం.. వ్యవహారికంగా తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే. సంపూర్ణంగా తెలుగులో మాట్లాడటం, కట్టు బొట్టు లో తెలుగుతనం కనిపించటం ఇవేవీ భాషాభిమానానికి నిజమైన కొలమానాలు కావు… నాకు తెలిసినంత వరకు ఆకలి వేస్తోందని అమ్మతో చెప్పడం దగ్గరనుంచీ చిటికెన వేలు పట్టుకు నడిపించిన నాన్న జ్ఞాపకాలు దాచుకునే dairy దాకా, బలపాలు పంచుకునే రోజులనుంచీ జులపాలు నరిసినా మరచిపోనీ స్నేహూతూల ఉత్తరాలు చదువుకునే దాకా, వేళలో నువ్వు ఎం చేస్తూ ఉంటావో అని ఏకాంతం నిండిన ప్రతి సాయం ఎదురుచూపులు యెదకెసి చూసిన ఆలోచనల సమీరాం దాకా…. ఇలా అణువనువునా ప్రతి క్షణానా అంతరంగాన్ని ఆవిష్కరించే మాద్యమం గా అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చిన వాడుక వేదికగా మాతృ భాషని గుర్తించగలగడమే నిజమైన భాషాభిమానం. భాషాభిమానం ఉండటం లో కలిగించుకోవటం లో పెంపొందించుకోవటం లో అభ్యంతరం ఎందుకో అర్థం కాదు. సౌమ్య గారు చెప్పింది అక్షర సత్యం నేటివిటీ ని నేటివ్ ల్యాంగ్వేజ్ మాత్రమే చెప్పగలదు. అవును ఆఫ్ఘన్ గురించి తెలుగు లో వ్రాయాలేం. అలాగే Naxalite la గోడు గురించి, రాయలసీమ కరువు రొద గురించి ఇంగ్లీష్ పుస్తకం వ్రాయ లేదు. బహుశా హృద్యంగా వ్రాయచ్చేమో కానీ హృదయాన్ని వ్రాయాలేం, కదిలించేలా వ్రాయచ్చేమో కానీ కనిపించేలా రాయాలేం.

కనుక మనం అమెరికలోనో Canadaలోనో Settle అయిపోతాం అక్కడి సామాజిక స్థితులే తప్ప మిగత పరిస్థుతులతో సంబంధం లేదు అనుకుంటే తెలీదు కానీఇక్కడ ఉండాలి అనుకుంటే, మన చుట్టూ ఉన్న స్థితిగతులని అర్థం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం భాష మీద అవగాహన అవసరం. మన ఉనికిని కోల్పోకూడదనీ మనకంటూ ఒక ఇదేంటిటైని కోల్‌ప్పొకూడదని అనుకుంటే భాష మాత్రమే దానిని ఇవ్వగలదు. మా పక్కింటి పిన్ని, వాళ్ల అబ్బాయి అమేరిక నుంచి వస్తున్నాడని, మొదటి సారి తన మానవరాలితో ఎదురెదురు కూర్చొని మాట్లాడతాను అని, బోలెడన్ని కథలు పాటలు పద్యాలు నేర్పిస్తాను అని, సంబరపడిపోయింది. తీర వచ్చాక పిల్లకీ ఒక ముక్కైనా తెలుగు రాదు. పిన్నీకి ఇంగ్లీష్ రాదాయే! వచ్చిన సదరు కొడుకు కోడలు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటున్నారాయె! ఇదేమి చోద్యం అని ఆడగబోతే, Don’t be silly… అని దాటవేశాడు సుపుత్రుడు. చివరకు బాబాయి Translator గా వ్యవహరించి ప్రయత్నించారు కానీ పిల్ల మన ప్రహ్లాదుడు కంటె హ్యారీ పాటర్ Interesting అని ఆవు పులి కంటె నార్నియా Exciting అని సాక్షాత్తూ శ్రీ మహవిష్ణువు అవతారమైన మోహినీ, సిండ్రీల్లా, స్నో వైట్ కంటె sexyగా ఉండదని తీర్మానించింది.

మనం గొర్రెదాటు మంద కాదని మనది గాలివాటు గమనం కాదని చెప్పటానికైనా

తెలుగు వ్యావహారికం కావాలి.

 

 

 

ఇక తెలుగు లో వైవిధ్యం విషయానికి వస్తే సౌమ్య గారు అన్న మాటని నిజం అని చెప్పలేం అలా అని తోసిపుచ్చలేం కూడానూ. తెలుగు లో వైవిధ్యం ఎక్కువగా ఉండదు అంతే కాక ప్రచురింపబడే పుస్తకాల సంఖ్య కూడా తక్కువే. ఒక భాషలోని రచనలు ప్రాంత స్థితిగతులను, చుట్టూ ఉన్న సమకాలీన పరిస్థుతులను, అనుసరించి ఉంటాయనేడి వాస్తవం, కాబట్టి తెలుగు లో ఎక్కువగా వైవిధ్యం లేకపోవచ్చు, కానీ సమకాలీన రచయితలు లెరనడం సబబు కాదేమో. Mohd..ఖదీర్ బాబు, కుప్పిలి పద్మ, చంద్రలత, నవీన్, వాడ్రేవు చినవీరభధ్రుడు, మృణాలిని, శివారెడ్డి, ఇలా బోలెడు మంది ఉన్నారు అడపా దడపా పుస్తకాలు వ్రాస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. ఇంటెర్నెట్ శకం ప్రారంభమైనప్పటి నుంచి పుస్తకపథనం తగ్గిపోయింది. విశాలాంధ్ర మొబైల్ బుక్‌షాప్ ఉద్యోగి ఒకసారి నాతో మాట్లాడుతూ పది పదిహేను సంవత్సరాల క్రితం ఎప్పుడైనా పుస్తకాలు తీసుకొని బస్ వేసుకొని వెళ్తే మూడు రోజుల్లో పుస్తకాలు ఖాళీ కావడం తో పాటు బోలెడన్ని ఆర్డర్లతో తిరిగి వచ్చే వాళ్ళం అని ఇప్పుడు కనీసం 20% కూడా అమ్ముడు పోవటం లేదని కన్నీటి పర్యంతం అయ్యాడు. నిజమే! ఎవరో ఎందుకు మా అమ్మ కనీసం 5 తరగతి వరకు కూడా చదువుకోలేదు, కానీ ముప్పాల రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, కోడూరు కౌశల్యదేవి, గోవిందరాజు సీతాదేవి, యద్దనపూడి సులోచనారాణి తదితరుల రచనలు అన్ని చదివింది. ఇన్‌ఫ్యాక్ట్ మా చెల్లాయి కి యద్దనపూడి వ్రాసిన శంఖుతీర్థం అనే నవలలో కథానాయిక పేరుపెట్టారు విష్ణు వందన అని. మరి ఇప్పుడో, డేలీ సీరియల్స్, సినిమాలు, ఇంకా ఎన్నో వ్యాపకాలు, పుస్తకాలు చదివేది ఎవరు. కాబట్టి అదీ అసలు సమస్య

ఇంకా తెలుగు పై ఆవరణ ప్రభావం తప్పనిసరి కానీ పైన చెప్పినట్టు భాషాభిమానం ఉండడానికి ఆవరణ ప్రభావం ఉండడానికి పెద్దగా సంబంధం లేదు. బహుశా మాలతీ గారు కూడా ఇదే ప్రస్తావించారు అనుకుంటా. ఇంకా నేను గమనించింది ఏమిటంటే కవితలు గట్రా రాసేవాళ్ళు చాలా వరకు ప్రవాసం లో ఉన్న వారే. వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ సాహితీ పిపాస ఉన్నవారి మీద ఆవరణ ప్రభావం అంతగా కనిపించదు. అంత ఎందుకు బ్యాంగలుర్ లో ఉన్న నాకె బోలెడన్ని సార్లు తెలుగు మాట్లాడేటప్పుడు కన్నడ పదాలు కలుస్తుంటాయి.. మరి అంత దూరం పూర్తిగా కొత్త దేశం వెళ్ళినప్పుడు ఆవరణం ప్రభావం కొంచం ఎక్కువగానే ఉంటుంది..

ఇక Career ప్రధానంగా సాగే జీవితం లో తెలుగుకు ప్రాముఖ్యత అవసరమా అనే వాళ్ళతోనే అసలు చావంతాఇంగ్లీష్ మీడియమ్ లో చదివితే ఆణిముత్యాలు అయిపోతారని తెలుగు మీడియమ్ బడిలో చదివితే అక్షరం కోరగాకుండా పోతారని వీళ్ళు ఎప్పటికప్పుడు జనాన్ని భయపెడుతూనే ఉంటారు. మరో అడుగు ముందుకు వేసి సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ అవ్వలనుకునే వాడికి ఔరంగజేబు పన్నులు వేసాడో, అశోకుడు రోడ్డుకు వైపున చెట్లు నాటించాడో, కిరణజన్య సంయోగ క్రియలో నైట్రిక్ అమ్లమ్ నిష్పత్తి ఎంతో, వానపాము పునరుపత్తి విధానాలు ఏమిటో, తెలుసుకోవాల్సిన అవసరం ఏవిటని వాదిస్తున్నారు.. ఇప్పటికీ IIT విద్యార్హత సంపాదించే వాళ్ళలో దాదాపు 90% మంది జిల్లా పరిషద్ schoolsలో చదువుకున్న వాల్లెనని మాతృభాషలో చదువుకునే వారికి సబ్జెక్ట్ బాగా అర్థం అవ్వడంతో పాటు సులువుగా ప్రతి దాన్ని ప్రశ్నించే అలవాటుపరిశీలించే అలవాటు కూడా వస్తాయని IIT ర్యామేయైయ గారు మొన్ననే ఒక ఆర్టికల్ వ్రాశారు.

అంతెందుకు నాతొప్పటు engineering చదివిన వాళ్ళలో దాదాపు 90% తెలుగు మీడియమ్ వాళ్లే టాపర్స్ 10 మంది లో ఎనిమిది మంది తెలుగు మీడియమ్ వాళ్లే, GATE లో IIT లో సీట్ సంపాదించిన ముగ్గరు తెలుగు మీడియమ్ వాళ్లే. ఒక వేళ ఇంగ్లీష్ మీడియమ్ లో చదివినా మరీ తెలుగును విడనాడి చదివి బాగుపాడిన వాళ్ళు కానీ తెలుగు చదువుకోవడం వల్ల జీవితం నాశనం చేసుకున్నవాళ్లు కానీ నాకు తటస్థపడలేదు. తెలుగు బ్రతుకుతెరువు కాలేకపోతుందేమో కానీ బాగుపాడకపోవటానికి కారణభూతం మాత్రం కాదు. అలా ఆలోచిస్తే అసలు సంగీతం, నృత్యం, నటన, చిత్రలేఖనం, క్రికెట్ చివరకు ఇలా Blogలు వ్రాయడం కూడా చాలా సందర్భాల్లో Career కాలేవు మరి వీటన్నింటికి చోటివ్వగల మీ హృదయంలో తెలుగుకు మాత్రం చోటు లేకపోవడానికి కారణమేమో ఎంత ఆలోచించిన అర్థం కాదు. ఇక ప్రాపంచీకరణ తదితర కారణాల రీత్యా ఇంగ్లీష్ తప్పని సారి తెలుగు దన్డగ అనే వాళ్ళకు నాది ఒకే ఒక్క ప్రశ్న.. మరి జపాన్ లోను china లోను Russiaలోను ఇంకా ఎన్నో ప్రాంతాలు మనకన్నా అభివృద్ది చెందుతున్నాయి మనకన్నా అడుగున ఉన్నాయి కానీ వాళ్ళు వల్ల ఐడెంటిటీ ని భాషని వదులుకోవడం లేదే.. అదేలామన నిస్సహాయత చేతగానితనాలకు అనవసరంగా ప్రాపంచీకరణ, Career focus అనే సాకులు చెప్పడం సబబు కాదు

And above all దయచేసి అందరు గమనించాల్సింది…

తెలుగు భాష మనకు ఉద్యోగాలు ఇప్పించడానికో ప్రవాస నివాస అవకాశాలు, డాలర్ సంపాదనలు కల్పించడం కోసం కాదు పుట్టింది, మన భావ ప్రకటన కోసం మనకు మానసిక వివేకాన్ని ఇవ్వడంకోసం సమాజం లో మనకు నాగరికత నేర్పడం కోసం భాష పుట్టింది. తిండి పెట్టలేని భాష మనకెందుకు అనే వాళ్ళు గుడి లోంచే కాదు గుండెల్లోంచి కూడా దెవుళ్ళని, బంధువుల్ని, స్నేహితుల్ని, మీ అభిమాన సినిమా స్టార్లని, ఆటల్ని పాటల్ని అందరినీ అన్నిటినీ త్యజించండి ఎందుకంటే వీళ్ళలో కూడా చాలామంది అన్నం పెట్టలేరు. అంతే కాదు, ఇవన్ని అనవసరమైన విమర్శలు ఒక వైపు ఆకలితో అలమటిస్థున్తె మీకు తెలుగు భాష వైభవం కావాల్సి వచ్చిందా అని ఆక్రోశించే వాళ్ళు కనిపించారు.. ఇందులో తెలుగు భాష చేసిన తప్పేన్టొ అర్థం కాలేదు.. పైగా ఆ బాధలకు ఆవేశాలకు రూపం ఇచ్చింది ఈ భాషే అని మరచిపోకండి.. మీ ఉద్యమాలకు మీ ఉద్వేగాలకు అక్షర రూపం కలిగించి మీ ఉపన్యాసాల దగ్గరనుంచీ మీ సిద్ధాంతాల Manifestoల వరకు మీ ఆకాంక్షాలని అక్షరం గా నిలిపినవి ఆ అక్షరాలే అని మరచిపోవద్దు. మీ ఆశయాలను మోసిన కరపత్రాలలో నలిగింది, మీ నెత్తురు మండే ఆవేశాలు కుత్తుకలోంచి పెల్లుబికిన విప్లవ గీతాలై రగిలింది ఈ అక్షరమే అని మరిచిపోవద్దు. మీ సమస్య భాష రాజకీయాలతో ఐతే అభ్యంతరం లేదు కానీ భాషతో ఐతే ఆది కూర్చున్న కొమ్మను నరుక్కొవడమె!

ఇకపోతే చివరిగా ఏమీ చెయ్యాలి అనే ప్రశ్నకు నా సమాధానం! మీరు ఇప్పుడు చేస్తున్నదే చెయ్యాలి.. మళ్లీ మళ్లీ మరింతగా చెయ్యాలి.. పరిస్థితి బాగాలేదు అన్న మాట నిజమేకాని మరీ అంత భయంకరంగానూ లేదు. ఇప్పటికీ భాషాభిమానం ఉన్న వాళ్ళు బోలెడంత మంది ఉనారు. పొద్దు పత్రిక, మీ Blogలు చూశాక నాకు బాగా నమ్మకం కుదిరింది. పొద్దులో మంచి పాండిత్యం సాహిత్యం కనిపిస్తాయి. ఇలాంటి blogలు మరిన్ని రావాలి చదివే వాళ్ళ సంఖ్య తప్పకుండా పెరుగుతుంది. అనుమానం ఉంటే సౌమ్య గారి blog లో హిట్స్ చూడండి రోజుకు దాదాపు 200 మంది visit చేస్తారు అనుకుంటా.. దానితో పాటు మంచి రచనలు రావాలి.. దానికి మీలాంటి వాళ్ళు పూనుకుంటే ఖచ్చితంగా తెలుగు కు పూర్వ వైభవం వస్తుందికదిలేది కదిలించేది పెను నిద్దూర వదిలించేది.. అని శ్రీ శ్రీ చెప్పినట్టు.. సంగీతమపి సాహిత్యం సరస్వతీ స్థన ద్వయం ఏకం ఆనందసాగరం అన్యథ ఆలోచనామృతం అని కృష్ణశాస్త్రి చెప్పినట్టు సాహితీ స్రవంతులై ఉరకలు తీసే ఆలోచనలు ప్రభవించగల సృజనలు పుస్తాకాలై వచ్చినప్పుడు తప్పకుండా తెలుగు వేయి వెలుగులు వెలుగుతుంది

 

 

2 Responses to "చీకటి వెలుగుల తెలుగు"

మీ ఆలోచన బాగుంది. మీరు శ్రమపడి చేసిన విశ్లేషణ చాలా వివేకవంతంగా ఉంది. తెలుగు నశించిపోతోదని బాధపడటంకన్నా, “మన జీవితాల్లో తెలుగునెలా నింపుకోవాలా” అని ఆలోచిస్తే మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. తెలుగు జీవనాధారం కాకపోయినా,ఆలోచనా స్రవంతికి మూలం అని గ్రహిస్తే దానిఉపయోగం అదే వస్తుంది.

ఈ విషయాలపై నేను రాసిన టపా లంకెను ఇక్కడ ఇస్తున్నాను. చూడండి.
http://parnashaala.blogspot.com/2008/06/i-think-in.html
http://parnashaala.blogspot.com/2008/07/blog-post_13.html

మీ బ్లాగులో టెంప్లెట్ రంగూ అక్షరాల రంగుల కాంట్రాస్ట్ మూలంగా చదవడానికి ఇబ్బందిగా ఉంది. బహుశా ఫాంట్ సైజు కొంచెం పెంచడం బాగుంటుందేమో!

మీరు http://www.koodali.org లో చేరకపోతే ఇప్పుడే చేరండి. చాలా మంది తెలుగు బ్లాగర్ల అడ్రస్ అదే.

hi mahesh gaaru,

Mee abhiprayanni cheppinanduku kruthagnathalu…
nenu blog ki telugu typing ki baaga kottha, fontsize penchi inko post chesaanu…. pdf kooda upload chesaanu…

kishore…

Leave a Reply


  • None
  • Eliyas: బాగుంది బాగుంది
  • aruna: Ha haaa.. [:D] అబ్బ భలే రాశారు అండి కిషోర్ గారు. ఫలానా బ్లాగు(http://arun
  • kvmkishore: @ sowmya gaaru... nenu 200 annanu meeru 50 annaru sare evaridi kaadu chivari maata 120 khayam chesukundaam... antey meerinkem vaadinchoddu... globa