Posted by: kvmkishore on: October 3, 2008
” ఈ వీకెండ్ ప్లాన్ ఏంటి ” ఈ డైలాగ్ వినంగానె ఒక అంతంతమాత్రం పరిచయం ఉన్న అమ్మాయితో సినిమాకో షికారుకో వెళ్దాం అనే టెండర్ పెట్టే ప్రయత్నంలా అనిపిస్తుంది కదా. కానీ అలాంటిదేమి లేదు, నేను ఈ మధ్యన అందరిని తినేస్తోంది ఈ ప్రశ్నతోటె. మాకు మామూలుగా 6 డే వీక్, ఆదివారం మాత్రమె సెలవు. ఇక ఆదివారం ఒక కాలేజిలో ఫాకల్టిగా పని చేసే వాడిని కాబట్టి ఆదివారం అన్న ధ్యాసే ఉండేది కాదు. మరి ఇప్పుడు కొన్ని అనివార్య కారణాలవల్ల కాలేజి మానేసాను. సొ వీకెండ్స్ ఏమి చెయ్యాలొ ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అందుకనే బుజ్జిగాడు సినిమాలో లింగరాజు (ప్రభాస్) కనిపించిన ప్రతి ఒక్కరిని “నీకు Real Estate వెంకట్రావ్ తెలుసా” అని అడిగినట్టు నేను వీకెండ్స్ ఏం చేస్తుంటారు అని అడుగుతూనె ఉంటా.
నాకు ఎదురైన సమాధానాలు ఇవిగో ఇవి…
1.ఇంటికెల్లిపోవటమె! అనంతపురం ఎంత సేపు 5గంటలు. శుక్రవారం రాత్రి బస్ ఎక్కేసామంటె సతుర్దయ్ ఏర్ల్య్ మొర్నింగ్ అనంతపురం రేచ్ అయిపోతాం. అమ్మ పొద్దుటే ఉప్మా పెసరట్టు చేసి ఉంచుతుంది. మధ్యాహ్నం ముద్దపప్పులోకి ఆవకాయ వేసుకుంటె ఉంటుంది [కళ్ళు మూసుకున్నాడు]. ఇంక evening friendsని కలిసేసి వస్తాను. ఇంక sunday full non వెజ్. పొద్దున్నే ఇడ్లీ – చికెన్. మధ్యాహ్నం చేపల పులుసు. కీమా బాల్స్ [కళ్ళు మూసుకున్నాడు]. అమ్మ బట్టలన్ని ఉతికేసి ఉంచుతుంది. ఇంక night బయలుదెరి బెంగుళూరు వచ్చేస్తా. కాని కిషోర్ అదేంటొ every week వెళ్తాను కానీ బయలుదేరేటప్పుడు ఏడుపు వచ్చేస్తుంది [కళ్ళు తుడుచుకున్నాడు].
ఇట్లు నెలబాలుడు…
2.వీకెండ్సా ఏంది ఇట్టంటివి కూడా ఉన్నాయా.. బాసు! fridayకి డెలివరి ఇచ్చామంటే saturdayకి పగిలిపొయేన్ని issueలు ఉంటాయి. వీకెండ్స్ కూర్చొని పని చేసుకోలేదనుకో issues timeకి solve కావు, clientగాడు ఏసుకుంటాడు managerగాడు పిలిచి చావగొట్టుడు ఉంటాది. అయినా కెరీర్ గురించి సీరియస్ గా ఆలొచించే వాడికి ఇలాంటి ఆలోచనలు రావు అని శంకరాభరణం శంకరశాస్త్రిని రోడ్డు మీద ఆపి సిల్క్ స్మిత అడ్రెస్స్ అదిగినట్టు చీదరించుకున్నాడు.
ఇట్లు.,
ఒక పని రాక్షసుడు.
3.You know what I go to orphanage and teach those kids and play with them. you know kishore the satisfaction you get when you do that. I looooooove kids. But we used to do this when I was in college and all. we had a big gang of friends and it was cool to hangout with these kids. But from the time I joined this job[which means since two years] oh God! these females in my hostel. so much of attitude ya! If I don’t go out with them then that becomes one big mess. So someone calls me out and I will have to go out for shopping. We go to forum or garuda do some shopping have some nice lunch by the way that phirangi pani in forum is amazing kishore. I tell you , you have to visit that once, my God you get amazing kebabs there and yes we just come back.
ఇట్లు.,
ఒక so called social worker.
4.పొద్దున్నే లేచెప్పటికే రెండయిపోద్ది [దాన్ని పొద్దున అనరేమొ]. అలా ఎల్లి ఒక కాఫీ వేసుకొని వచ్చి ఇంకో చిన్న స్లీప్ వేసామనుకో ఐదైపోద్ది [మాజిక్]. అప్పుడు లేచి స్నానం అదీ చేసి ఒక మసాలా దోసె, ఒక సమోసా చాట్, పానిపూరి తినెసి వచ్చి పడుకున్నామనుకో……
“తెల్లారిపోద్ది” అన్నాను నేను… ఎధవా! కనిపెట్టేసావు, అన్నట్టు చిద్విలాసంగా నవ్వుతూ దుప్పటి కప్పేసుకున్నడు saggitarius కర్ణుడు. అబ్బా! అదేనండి కుంభ కర్ణుడు. టోపీలోంచి కుందేలుని బయటకు తీసిన పట్టాభిరాం ని చూసి ఆశ్చర్యపోయె పిల్లాడిలా ఏంటి ఇంత సింపులా అని ఆశ్చర్యపోతూ చూస్తుండిపోయాను.
5. Wake up at 5, go for a jog, comeback and do some yoga.
sharp at 7 have bath and go to temple.
8 o clock breakfast and I read the days news paper and sunday supplement.
11 o clock I wash my clothes
1 o clock have lunch
2 o clock go for a walk
5 o clock iron the clothes
6 o clock clean the bike
7 o clock cook food
8 o clock dinner
9 o clock watch news
10 o clock go to bed. – courtesy Mr. anandam [మీ ఆవిడ మిమ్మల్ని వదిలెసి ఎంత కాలమైంది అని అడగాలనుకున్నాను కాని...]
ఇంక నావల్ల కాలేదు. “నోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ” అని పెద్దగా కేకపెట్టి మూర్తి దగ్గరకు వెళ్ళాను. మూర్తి గురించి ఇంకెప్పుడైనా చెప్తాను ప్రస్తుతానికి చాల close friend అని గుర్తుపెట్టుకోండి చాలు. ” మూర్తి వీకెండ్స్ ఎమి చెయ్యలొ అర్థం కావటం లేదు. నువ్వు మామూలుగా ఏం చెస్తావ్” అని అడిగాను.
మూర్తి: ” ఏం చెయ్యలో ఆలోచిస్తుంటాను. అయ్యో అదేదొ సినిమాలో డైలగ్ కాదు. నిజంగానే ఏం చెయ్యలా అని ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కిపోయింది. మొన్న ఈ విషయం గురించే డీప్ గా స్టడీ చేద్దమని చాల రోజుల తరువాత బెంగుళూరులోనే ఉంటున్న స్కూల్ ఫ్రెండ్స్ ని కలిసాను. ప్రపంచం మొత్తం మారింది కానీ వీళ్ళు మాత్రం మారలేదు. పొద్దుటే లేచి తొమ్మిదింటికల్లా భీబత్సంగా గత్తర గత్తరగా జిగేల్ జిగేల్ గా రెడీ అయ్యి ఎదో ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళిపొతారు. అక్కడికి వెళ్ళిపోంగానే ఇలాగే వేరు వేరు ఏరియాలనుంచి వచ్చిన మిగతా స్నేహితులు కూడా కలుస్తారు. అందరు కుశలప్రశ్నలు అవ్వంగానే మూడు వర్గాల కింద విడిపొతారు…
Batch # 1:
Candidate 1: మామా! ఆ గ్రీన్ కలర్ చూడిదార్ చూడు మావా అబ్బ కేక! అరుపులు మావా! సోపరు! అర్రె! చూడ్రాబాబు ఇటే చూస్తంది! పడిపొద్దంటావా.. ఎల్లి మాటాడెయ్యమంటావేటి! ఏదో ఒకటి చెప్పరా!
Candidate 2: ఛీ! నీ! ఎక్కడికొచ్చినా మనం మారమా! వచ్చెతారండి అనకపల్లినుంచి ఎర్రబస్సెక్కేసి. సిటీకి వచ్చినా టేస్ట్ మారదారా! అక్కడ చూడమ్మ జీన్స్, టీ-షర్ట్, అలా ఉండాలి పిల్లంటె సిటి బేబ్స్.
Candidate 3: మీ మొహం! ఇక్కడ ఆంటిని చూసవా!<XXXXXXXXXXXXXXXXXXXXX>
Batch # 2A:
Candidate 1: తొక్క! నరసింహనాయుడు 105 సెంటర్లు పడితే కడుపుమండి ఇంద్రని ఆడిచ్చారురా మీవోళ్ళు. లేకుంటే మీ మొహనికి వంద సెంటర్లు దాటిన సినిమా ఉందా ఎదైనా!
Candidate 2: ఆ తోటకూర!వరసపెట్టి ఏడు ఫ్లాపులు ముందు మీ వాడిని ఒక్క హిట్ సినిమా తియ్యమని చెప్పండి మీవాడికి. ఎవడికి చెప్తారుబె! హిట్ లేదు కాని సెంటర్లు కావల్సొచ్చయా!
Batch # 2B
Candidate 1: Chance లేదు చిన్నా! ముప్పై! అంతకు మించి ఒక్క సీటు కూడా రాదు! అప్పట్లో అంటె తెలుగుదేశం పార్టీకి anti incumbency వల్ల favour అయ్యి ఓట్లు పడ్డాయి కానీ ఇప్పుడు సీను అట్ట లేదు కదా.
Candidate 2: రే! ఎక్కువ మాట్లొద్దు. అన్న గెలుస్తాడు ఎంత పందెం. చెప్పు! దమ్ముంటె చెప్పు!
Candidate 3: గదంతా తెలవది! ఏడికెల్లి అచ్చిన మరి తెలంగాన్లొ ఐతె ఒట్లు కాదు చిల్లర కూడ పడది.
Batch # 3
Candidate 1: మామా! consultancy వాడు hand ఇచ్చేలా ఉన్నాడు మామ! support చేస్తాడొ చెయ్యడొ కొంచెం tensionగా ఉంది మామా! అందుకే EP నేర్చేసుకొని Resume పెట్టేద్దామని అనుకుంటున్నాను. నువ్వేమంటావు మామా! EP మేలేనా లేకుంటే BI మీద ఇంకో రెండు projectlu పెట్టేసి వేరే consultancy చూసుకొమ్మంటావా!
Candidate 2: అర్రే! ఏమో మావా! నేను ఫుల్ మూడ్ off లో ఉన్నా! వాడెందిబే! project managerగాడు, ఆడికేమొ పైసా subject రాదు మళ్ళీ 7 years functional అంటాడు, 4 years SAP realtime అంటాడు, అరె! పిచ్చికుక్క లెక్క ఆ document ఈ report అని అరుస్తునె ఉంటాడు బె!
Candidate 3: మీ దాంట్లొ ఏమన్నా openings ఉన్నాయా మామ! backdoor అయినా పర్లేదు pressure ఎక్కువైపొయింది resume forward చెస్తావా!
ఇలా సాయంత్రం దాక ఇవే discussionన్లు మార్చి మార్చి… ఏమో నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు…
అయిపోయింది అమ్ములపొదిలో చివరి అస్త్రం కూడా పనిచెయ్యలేదు అయినా వదిలేది లేదు! చెప్పండి ఈ వీకెండ్ మీ ప్లాన్ ఎంటి….
@ Poornima gaaru,
mee laanti popular blogger daggaranunchi compliment pondadamante paakkune pilladiki foriegn car icchinatte.. not kidding seriously felt very happy for your comment.. thappakundaa and I have sent my link to koodali.. I think it will get updated soon….
Ha haaa.. [:D]
అబ్బ భలే రాశారు అండి కిషోర్ గారు. ఫలానా బ్లాగు(http://arunagjintelugu.blogspot.com) లో విషయాలు కూడ చాలా బాగా రాస్తారు అంట. చూసి కామెంటులు రాయటం మర్చిపోకండేం..
బాగుంది బాగుంది
October 3, 2008 at 6:53 pm
hahaha.. good one!
నా వీకెండ్ ప్లాన్స్ ఆ.. హమ్మ్.. ప్లానులేమేసుకోకుండా తోచింది తోచినట్టు తోచినప్పుడు చేయడం! రోజూ వేసుకునే ప్లానులు చాలవూ.. మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు?
మంచి టపా! రాస్తూ ఉండండి.
మీ బ్లాగు కూడలిలో లేకపోతే, త్వరగా జతపరచండి.
పూర్ణిమ